స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం. 1 సినిమాలో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, అశోక్, రాఖీ, యమదొంగ, జనతా గ్యారేజ్, అదుర్స్ లాంటి సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు.
 
ఎన్టీఆర్ లావుగా ఉన్నాడని చాలా విమర్శలు ఎదురుకున్నప్పటికి.. ఏ రోజు వెనకడుగు వేయకుండా నిలిచి ఈ రోజున స్టార్ హీరో అయ్యాడు. ఒక్కో అడుగు పైకి ఎక్కుతూ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఎన్టీఆర్ నటన చాలా అద్బుతంగా ఉంటుంది. అలాగే ఈయన డాన్స్ చేస్తే మాత్రం, ఎవరు ఈయనకి పోటీగా రారంటే అతిశయుక్తి కాదు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి ఆస్కార్ అవార్డు ని కూడా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత దేవర మూవీలో నటించి పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ వేరే సినిమా ప్రాజెక్ట్ లతో బీజీ గా ఉన్నారు.
 
ప్రస్తుతం బాలీవుడ్ సినిమా వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ హీరోగా దేవర పార్ట్ 2 సినిమా చేయనున్నారు. ఈ సినిమా ప్రశాంత్ నీల్, కొరటాల శివ తెరకెక్కించనున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ చాలా బక్కగా అయినట్లు కనిపించారు. అయితే ఆయన కావాలనే బక్కగా అయ్యారు అంట. తన నెక్స్ట్ సినిమాలో లుక్ కోసం అలా సన్నగా అయ్యారంట. దేవర పార్ట్ 2 సినిమా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: