- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


కొద్ది రోజులుగా సినిమా రంగం గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటోంది .. .ఈ విష‌యం ఎవ‌రైనా అంగీక‌రించాల్సిందే .. అస‌లు ఇప్పుడు ఉన్న ప‌రిస్థితులు కంటిన్యూ అయితే సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల మ‌నుగ‌డ క‌ష్ట‌మే అని ప్ర‌తి ఒక్క‌రు అంగీక‌రిస్తోన్న విష‌యం. అస‌లు ఇప్పుడు న్న ఓటీటీ యుగం లో .. సోష‌ల్ మీడియా యుగంలో చాలా మంది థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఓటీటీ లోనో లేదా ఐ బొమ్మ లోనో సినిమాలు చూసేస్తున్నారు. ఇక వారానికి కనీసం రెండు సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. సినిమాలు రిలీజ్ అయిన వెంట‌నే మేక‌ర్స్ వెంట‌నే స‌క్సెస్ మీట్ పెట్టేసి త‌మ సినిమా సూప‌ర్ హిట్ అని చెప్పుకుంటూ ఉంటారు. వాస్త‌వం ఏంటంటే ఇటీవ‌ల కాలంలో ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదు అన్న మాట‌ నగ్నసత్యం. ఈ మాట మీడియా రాస్తే మీడియాకు ఏం తెలుసు ? ఫుట్ పాల్స్ బాగున్నాయి .. మా సినిమా క‌లెక్ష‌న్లు సూప‌ర్ అని నిర్మాత‌లు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అస‌లు విస‌యం వాళ్ల‌కు కూడా తెలుసు. ఇదే విషయం డైరెక్టర్ త్రినాధరావు నక్కిన నిర్మొహమాటంగా చెప్పారు.


త్రినాథ్ రావు నక్కిన నిర్మాతగా చేసిన సినిమా చౌర్యపాఠం. ఈ సినిమా వచ్చేవారం రిలీజ్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే నిర్వ‌హించిన ప్రెస్ మీట్లో ఆయ‌న థియేట‌ర్ల‌కు జ‌నాలు రావ‌డం లేద‌న్న విష‌యాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ‘జనాలు థియేటర్స్ కి రావడం లేదు. షోలు క్యాన్సిల్ అవుతున్నాయి .. చాలా చోట్ల‌ సెకండ్ షోలని ఎత్తేస్తున్నారు ... పరిస్థితి చాలా దారుణంగా ఉంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక తాను స్వయంగా థియేటర్స్ కి వెళ్లి చూశాను. సినిమాలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. స్టార్ల సినిమాలకే జనం రాక‌పోతే ఇక కొత్త హీరోల‌తో తీసే సినిమాల కు మాత్రం ఎవ‌రు వ‌స్తార‌ని ఆయ‌న ఆవేద‌న తో త‌న స్వ‌రం వినిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: