మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా గురించి పరిచయం అనవసరం. బ్యూటీ అందాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె మాట్లాడుతూ తన మొదటి పారితోషకం ఎంతో చెప్పుకొచ్చింది. తమన్నా మాట్లాడుతూ.. నేను చాలా సినిమాలలో నటించాను. కానీ నా మొదటి పారితోషకం లక్ష రూపాయలు. అది కూడా నేను 2005లో ఓ యాడ్ కోసం మూడు రోజు షూట్ చేశాను. దానికి లక్ష రూపాయలు ఇచ్చారు' అని మిల్క్ బ్యూటీ తెలిపింది.  

ఈ అందాల భామ తెలుగుతో పాటుగా తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమె ఇప్పటికే దాదాపు 75పైగా సినిమాలలో నటించింది. ఈమె చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ సినిమాతో తన నటన జీవితాన్ని మొదలుపెట్టింది. తెలుగులో శ్రీ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన నటనతో మంచి సినిమా అవకాశాలను కొట్టేసింది.

ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, బాహుబలి, రచ్చ, తడాఖా, ఊపిరి, ఎఫ్ 1 అండ్ 2, సైరా నరసింహ రెడ్డి, బెంగాల్ టైగర్ సినిమాలలో నటించింది. ఈ భామ ప్రస్తుతం ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక నేచురల్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాలో తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా ప్రధాన పాత్రలు పోషించారు. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా కాపాడుతాడనేది ఈ మూవీలో చూపిస్తారు. ఈ సినిమా నేడు థియేటర్ లో విడుదల కానుంది. మరి ఈ సినిమాతో తమన్నా భాటియా విజయం సాదిస్తుందో.. లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: