టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో తమన్నా ఒకరు. తమన్నా కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ఓదెల అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే తాజాగా తమన్నా ప్రధాన పాత్రలో ఓదెల 2 అనే మూవీ ని రూపొందించారు. ఈ మూవీ ని ఈ రోజు అనగా ఏప్రిల్ 17 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక మంచి ప్రేక్షకధరణ పొందిన ఓదెలా మూవీ కి కొనసాగింపుగా రూపొందిన మూవీ కావడంతో ఓదెల 2 పై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఈ మూవీ ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుపోవడంతో ఈ మూవీ పై అంచనాలు మరింతగా పెరిగాయి. దానితో ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో దాదాపు 3.5 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక సీడెడ్ ఏరియాలో ఒక కోటి , ఆంధ్రలో నాలుగు కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి 8.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని మరో రెండు కోట్ల మేర ఈ మూవీ కి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 10.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ఇతర వర్షన్ లను ఈ మూవీ బృందం సొంతగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ 11 కోట్ల మేర షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: