
కోల్ కత్తాకు చెందిన సమీరా బెనర్జీ .. 1997 నుంచి హిందీ సీరియల్స్ లో నటిస్తుంది .. బాలీవుడ్ బుల్లితెరపై మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్న సమీరా .. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అడుగుపెట్టింది . ఒకపక్క సీరియల్స్ చేస్తూనే మరోపక్క సినిమాల్లో అవకాశాలు అందుకుంది . అలా యజ్ఞం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది .. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ సమీరాకు తెలుగులో అవకాశాలు రాలేదు .. అలాగే మరి ఏ భాషలోనూ సినిమాలు చేయలేదు .. దీంతో తిరిగి మళ్లీ సీరియల్స్ లోకి వెళ్లిపోయింది ఈ బ్యూటీ ..
అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో దోరి అనే సీరియల్ లో నటిస్తుంది .. ఒకప్పుడు తన అందంతో మాయ చేసిన సమీరా ఇప్పుడు బుల్లితెరపై అత్త పాత్రల్లో నటిస్తుంది .. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యక్టివ్ గా ఉంటుంది .. ఎప్పటికప్పుడు తన తాజా వీడియోలు ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది .. తాజాగా సమీరాకు సంబంధించిన లేటెస్ట్ లుక్ ను చూసి తెలుగు అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు .. యజ్ఞం సినిమాలో ఎంతో అందంగా కనిపించిన సమీరా ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ ఆమె ఫోటోలకు కామెంట్లు చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు .