- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రభాస్ ప్రస్తుతం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు .. ఇటలీ లోని ఓ విలేజ్ లాంటి ప్లేస్ లో ఓ ఇంట్లో ఈ పాన్ ఇండియ‌ హీరో సేద తీరుతున్నాడు .. స‌మ్మ‌ర్ ముగిసే వరకు ఆయన మళ్లీ షూటింగ్  సెట్ మీదకు వెళ్లక పోవచ్చు .. ఆయన చేతి లో ఉన్న రాజా సాబ్ , పౌజి సినిమాల షూటింగ్ లు పెండింగ్ లోనే ఉన్నాయి .. అలానే రాజా సాభ్‌కు కొన్ని రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది .. పౌజీ పనులు చాలా ఉన్నాయి .. ఇక రాజాసాభ్‌ టీజర్ కూడా ఇంకా రాలేదు .. దర్శకుడు మారుతి కట్ చేసిన టీజ‌ర్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ..

ఇక దీని విడుదల చేయాల్సి ఉంది .. ఈ ఏడాది కి కేవలం రాజా సాభ్‌ మాత్రమే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది .. అది కూడా దసరా లోగా రిలీజ్ అయితే లేదంటే ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కే .  ఇక ఫౌజి సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ కు రావుచ్చ నే టాక్ కూడా ఉంది .. అలానే నిజాని కి సందీప్ వంగా సినిమా షూటింగ్ కు వెళ్లాలి .. ఇక దాన్ని 2026 స‌మ్మార్ కు అని టాక్ కూడా ఉంది .. కానీ ఈ మధ్య లో ఫౌజి మూవీ సంగతి తేలాల్సి ఉంది .. ఇలా చేతి లో ఉన్న వరుస 3 సినిమా లు కంప్లీట్ అయితే సలార్ 2 మీద కు వెళ్లాలి ప్రభాస్ .. ఈ లోగా ఎన్ని సమ్మర్లు వస్తాయో .. ఎన్నిసార్లు ప్రభాస్  ఇటలీ కి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు ..?

మరింత సమాచారం తెలుసుకోండి: