నేచురల్ స్టార్ నాని ఈ మధ్య వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. కాగా ఆమధ్య వచ్చిన దసరా, సరిపోదా శనివారం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. మధ్యలో "అంటే సుందరానికి" సినిమా నిరాశ పరిచినా మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం హీరో నాని తెలుగులో "హిట్ 3: ది థర్డ్ కేస్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.  నాని హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ 3 .. ఈ సమ్మర్ కానుక గా మే 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందు కు రావడాని కి రెడీ అవుతుంది ..


సినిమా ను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి యాక్షన్  థ్రిల్లర్ గా తెరకెక్కించాడు .. ఇక హిట్ ఫ్రాంచైజీ లో ఈ మూవీ హ్యాట్రిక్ విజయం అందుకోవటం ఖాయమ ని సినిమా యూనిట్ గట్టి ధీమా వ్యక్తం చేస్తుంది .. కాగా ఈ సినిమా ను పాన్ ఇండియా స్థాయి లో రిలీజ్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే .. అయితే ఈ సినిమా కి సంబంధించిన‌ మలయాళ రైట్స్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫారర్ ఫిలింస్ బ్యానర్ దక్కించుకుంది .. ఇక దీంతో ఈ సినిమా ను కేరళ లో దుల్కర్ సల్మాన్ గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నాడు ..


ఇలాంటి హిట్ వర్స్ సినిమాల కు అక్కడ భారీగా క్రేజ్ ఉండటం తో ఈ సినిమా రైట్స్ ను మంచి ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది .. ఈ సినిమా లో నాని నటనకు అక్కడ ప్రేక్షకులు థ్రిల్ కావటం ఖాయమ ని  చిత్ర వర్గాలు చెబుతున్నాయి .. ఇక ఈ సినిమా లో నాని కి జంట గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది .. అలాగే ఈ సినిమా కి మిక్కీజీ మేయర్ సంగీతం అందించాడు .. అయితే ఇప్పుడు ఈ సినిమా దుల్కర్ సల్మాన్ కు ఎంత మేర లక్‌ తీసుకు వస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: