డిజిటల్ అరంగేట్రం చేసిన తరువాత సరిగ్గా 6 సంవత్సరాల తరువాత దర్శకురాలు సోనమ్ నాయర్ జీవితం పూర్తిగా మారిపోయింది. దానికి కారణం 'కాఫిర్' స్ట్రీమింగ్ సిరీస్. ఈ షో మరో రౌండ్ ఎడిటింగ్‌కు గురై సినిమాగా తిరిగి విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు షురూ చేస్తోంది. ఇందులో బాలీవుడ్ నటి 'దియా మీర్జా' కీలక పాత్ర పోషించింది. ఆమె పోషించిన పాకిస్తానీ మహిళ 'కైనాజ్ అక్తర్' పాత్ర గురించి ఇపుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె అనుకోకుండా సరిహద్దు దాటిన తర్వాత భారతదేశంలోకి ప్రవేశించి, చివరికి ఉగ్రవాది అనే అనుమానంతో జైలు పాలవుతుంది. అదే బేస్ లైన్.

ఈ సిరీస్ విడుదలకు ముందే అందరిని దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ఇతివృత్తం, కఠినమైన సన్నివేశాలు మరియు అన్నింటికంటే మించి, దియా నటన హైలైట్ అయ్యాయి. ఈ క్రమంలోనే దియా మీర్జా సదరు సినిమాలోని ఒక సన్నివేశాన్ని, చిత్రీకరించడం కోసం చాలా కష్టపడ్డామని, ఆ తరువాత తాను చాలా ఇబ్బందులు పడ్డానని ఓ మీడియా వేదికగా పంచుకుంది. అదే ఆ సినిమాలోని అత్యాచారం సీన్. ఈ సీన్ భావోద్వేగపరంగా మరియు శారీరకంగా కష్టతరమైన సన్నివేశం కావడం చేత చిత్రీకరణ తర్వాత తాను వాంతులు చేసుకున్నానని వెల్లడించింది.

ఆమె మాట్లాడుతూ... "మేము అత్యాచార సన్నివేశాన్ని చిత్రీకరించిన సీన్ నాకు ఇంకా గుర్తుంది. అది చాలా కష్టంగా తోచింది నాకు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించిన తర్వాత నేను శారీరకంగా వణికిపోయాను. నాకు వాంతులు కూడా అయ్యాయి. ఆ మొత్తం సన్నివేశాన్ని చిత్రీకరించడం పూర్తయిన తర్వాత నేను వాంతి చేసుకున్నాను. ఆ పరిస్థితులు ఎంత కష్టతరంగా ఉన్నాయో ఇంకా నేను చెప్పలేను.! అని చెప్పుకొచ్చింది. అయితే, కైనాజ్ పాత్రను పోషించడం వల్ల తాను ఒక వ్యక్తిగా ఎదగడానికి సహాయపడిందని, నిజ జీవితంలో ఆమె తల్లిగా మారడానికి ముందే ఆమెలో తల్లి భావాలను నింపిందని దియా ఈ సందర్భంగా వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: