రాజమౌళి డైరెక్షన్లలో గొప్ప విజువల్ వండర్ గా వచ్చినటువంటి చిత్రం బాహుబలి.. ఈ సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి చేరిందని చెప్పవచ్చు. 2015లో విడుదలైన ఈ సినిమా హీరో ప్రభాస్ కెరియర్నే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమని రాజమౌళి పేరును దేశవ్యాప్తంగా వినిపించేలా చేసింది. ఇందులో నటించిన అనుష్క, రానా, తమన్నా వంటి హీరోయిన్స్ కి కూడా పాన్ ఇండియా లెవెల్లో అవకాశాలు వెలబడ్డాయి. ఈ సినిమా సుమారుగా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.


ఇందులో కీలకమైన పాత్రలో నటించినటువంటి సత్య రాజ్ , రమ్యకృష్ణ, నాజర్ వంటి స్టార్ యాక్టర్స్ కూడా ఇందులో నటించారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ఎంఎం కీరవాణి అందించిన సంగీతం కూడా బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ బాహుబలి ది బిగినింగ్ సినిమా అంతర్జాతీయంగా మరొకసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రిమింగ్ అవుతూ ఉన్నది. ఇప్పుడు స్పానిష్ భాషలో కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమ్మింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.


ప్రపంచ యాత్రలో మరొక ఘట్టానికి బాహుబలి చేరుకోబోతోందని అయితే ఈ సినిమాను అంతర్జాతీయ మాధ్యమికాలలో కూడా మరింత వైరల్ గా చేసేందుకే  నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ ఆడియన్స్ కోసం ఇలాంటి డెసిషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ తగ్గట్టుగా సినిమాలు కూడా పడుతూ ఉండడంతో ఈ విషయం విన్న అభిమానులు మరింత ఆనంద పడుతూ తన రాబోయే సినిమాలకు ఇది మరింత ప్లస్ అవుతుందని తెలియజేస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా చిత్రాలతోనే ప్రభాస్ ఫ్యాన్స్ నీ అలరిస్తూ ఉండడంతో ఇక రాబోయే రోజుల్లో గ్లోబల్ స్థాయిలో కూడా చిత్రాలని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: