టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారి లో దిల్ రాజు ఒకరు. దిల్ రాజు సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ "రౌడీ బాయ్స్" అనే సినిమాతో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో పర్వాలేదు అనే స్థాయి గుర్తింపు మాత్రం దక్కింది. ఈ మూవీ తర్వాత ఈయన లవ్ మీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయింది.

కాని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. కొంత కాలం క్రితం ఈ నటుడు సెల్ఫిష్ అనే సినిమాను మొదలు పెట్టాడు. కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ ను తిరిగి మళ్లీ మొదలు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఆశిష్ నెక్స్ట్ మూవీ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఆశిష్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో చేయబోతున్నట్లు , ఈ మూవీ కి హరీష్ శంకర్ కథను అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాంబో మూవీ కి సంబంధించిన సంప్రదింపులు చాలా వేగ వంతంగా జరుగుతున్నట్లు , అన్ని ఓకే అయితే ఈ కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: