సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో పొందుతున్న కూలీ అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. రజనీ కాంత్ హీరో గా నటిస్తున్న మూవీ కావడం , అందులో నాగార్జున ఓ కీలకమైన పాత్రలో నటిస్తుండడం , ఆ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో బారి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క తెలుగు హక్కుల కోసం అత్యంత భారీ ధరను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు వర్షన్ హక్కుల కోసం ఏకంగా 40 కోట్ల ధరను ఈ మూవీ మేకర్స్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను కనుక 40 కోట్లకు అమ్మినట్లయితే దాదాపు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లకు మించిన గ్రాస్ కలెక్షన్లను వసూలు చేస్తేనే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకునే అవకాశం ఉంటుంది. అలా 80 కోట్ల కలెక్షన్లను తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ వసూలు చేయాలి అంటే ఈ మూవీ కి కచ్చితంగా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ రావాల్సి ఉంటుంది అని కూడా చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: