కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ ఆఖరుగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వెట్టాయన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తెలుగులో వేటగాడు అనే పేరుతో విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే స్థాయి విజయాన్ని మాత్రమే అందుకోగలిగింది. ఇకపోతే ప్రస్తుతం రజనీ కాంత్ , లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

మూవీ లో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రజనీ కాంత్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే పూజ హెగ్డే తాజాగా సూర్య హీరోగా రూపొందిన రేట్రో అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పూజ హెగ్డే వరస పెట్టి ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తుంది.

అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా పూజ హెగ్డే "కూలీ" సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. తాజాగా పూజ హెగ్డే మాట్లాడుతూ ... కూలీ మూవీ లో ఒక్క పాటకు మాత్రమే నేను డాన్స్ చేశాను. ఆ పాట చాలా డిఫరెంట్ వెబ్ ను కలిగి ఉంటుంది. అలాగే ఆ పాట ఎంతో సరదాగా కూడా ఉంటుంది. ఆ మూవీలో నేను నటించడం లేదు. ఒక పాటలో మాత్రమే నటించాను అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: