ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవు డ్ స్టార్ డైరెక్టర్ల లో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వం లో ఓ మూ వీ రూపొందబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబోలో సినిమా ఉండబోతుంది అని అనేక రోజులు అనేక వార్తలు వచ్చాయి . మధ్యలో వీరి కాంబోలో మూవీ రావడం లేదు అని కూడా వార్తలు వచ్చాయి . ఇకపోతే ఎట్టకేలకు బన్నీ , అట్లీ కాంబో మూవీ ఓకే అయ్యింది. ఈ మూవీ ఓకే అయినట్లు ఈ చిత్ర బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా విడుదల చేశారు.

మూవీ బృందం వారు విడుదల చేసిన వీడియో ప్రకారం బన్నీ , అట్లీ కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండబోతున్నట్లు క్లియర్గా అర్థం అవుతుంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కించబోయే మూవీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఆల్మోస్ట్ బన్నీ మూవీ లో ముగ్గురు హీరోయిన్లను అట్లీ కన్ఫామ్ చేసినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... అల్లు అర్జున్ , అట్లీ కాంబోలో సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీమణులు అయినటువంటి జాన్వీ కపూర్ , దిశా పాటని , శ్రద్ధా కపూర్  హీరోయిన్లుగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే పుష్ప లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత అల్లు అర్జున్ నటించబోయే మూవీ కావడం , కెరియర్లో ఒక అపజయం కూడా ఎరుగని అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: