చిరంజీవి కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘విశ్వంభర’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈమూవీ టీజర్ విడుదలైన తరువాత ఆమూవీ టీజర్ పై విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఎలర్ట్ అయిన ఈమూవీ దర్శక నిర్మాతలు ఈమూవీ గ్రాఫిక్ వర్క్స్ పై మరింత శ్రద్ధ పెట్టడమే కాకుండా ఈమూవీ మేకింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తల పై మరింత శ్రద్ధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈమూవీ దర్శకుడు వశిష్ట కు పెద్ద హీరోలతో సినిమాలు తీసిన అనుభవం గతంలో లేకపోవడంతో చిరంజీవి ఈమూవీ మేకింగ్ పై మరింత శ్రద్ధ పెట్టడమే కాకుండా దర్శకుడు వశిష్ట కు ఈమూవీ విషయంలో సలహాలు ఇవ్వడానికి చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన వినాయక్ ను రంగంలోకి దింపడమే కాకుండా దర్శకుడు నాగ్ అశ్విన్ సలహాలు కూడ వశిష్ట కు అందేవిధంగా చిరంజీవి ముందు చూపుతో వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్.

అయితే గతవారం జరిగిన హనుమత్ జయంతి సందర్భంగా విడుదలైన ఈమూవీలోని ‘రామ రామ’ ఫస్ట్ ఆడియో సింగల్ కు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. కీరవాణి కంపోజ్ చేసిన ఈసాంగ్ ట్యూన్ చాలామందికి పెద్దగా నచ్చలేదు అని అంటున్నారు. అదేరోజు విడుదలైన ‘రఘుకుల తిలక రామా’ అంటూ విడుదలైన ఒక ప్రవేత సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

దీనితో రానున్న రోజులలో ‘విశ్వంభర’ ప్రమోషన్ ను చాల జాగ్రత్తగా చేయకపోతే ఈమూవీ మార్కెటింగ్ విషయంలో సమస్యలు ఎదురయ్యే ఆస్కారం ఉంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.  దీనితో ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి మరొక కొత్త టీజర్ ను విడుదల చేసి ఈమూవీ క్రేజ్ ను పెంచాలని ఈమూవీ దర్శక నిర్మాతల ఆలోచన అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈమూవీని దసరా రేస్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నప్పటికీ ఈమూవీ మార్కెటింగ్ పూర్తి కాకపోతే మరొకసారి వాయిదా పడే అవకాశం ఉంది అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: