తమన్నా, వశిష్ట, హెబ్బా పటేల్, మురళి శర్మ శ్రీకాంత్ అయ్యంగార్ తదితర నటినటుల కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఓదెల 2. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అశోక్ తేజ డైరెక్షన్లో సంపత్ నంది కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో తమన్న హిట్ కొట్టిందా లేదా ఒకసారి చూద్దాం.


కథ విషయానికి వస్తే.. ఓదెలలో తిరుపతి (వశిష్ట) అతని భార్య రాధ (హెబ్బా పటేల్) తిరుపతిని చంపేసిన తర్వాత ఆ ఊరంతా పండగ చేసుకుంటూ ఉంటుంది. తిరుపతి పోస్టుమార్టం చేసి ఊరికి తీసుకొస్తున్న సమయంలో ఆత్మకి కూడా శాంతి కలుగుకూడదని సమాధికి శిక్ష వేస్తార ఊరి జనం. దీంతో ఆ చనిపోయిన  తిరుపతి ఆత్మ అక్కడే ఘోషిస్తూ ఉంటుంది.. అదే ఊర్లో మళ్లీ వివాహాలు జరుగుతూ ఉండగా ఆ సమయంలోనే తిరుపతి వచ్చి ఊర్లో కొత్తగా వివాహాలైన అమ్మాయిలకు శోభనం జరిగే రోజే చంపేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఆ ఊరి ప్రజల తట్టుకోలేక జైల్లో ఉండే రాధా దగ్గరికి వెళ్లి ఉపాయం కోసం వెళ్తారు ఊరి ప్రజలు. దీంతో అక్కడ రాధ తన అక్క బైరవి (తమన్నా) గురించి తెలియజేస్తుంది. ఆ తర్వాత ఊరి ప్రజలు ఏం చేశారు? తమన్నా ఏం చేసింది అనే కథఅంశమే ఓదెల2.గతంలో ఓదెల రైల్వే స్టేషన్ సినిమా నేరుగా ఆహా ఓటీటిలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ సినిమా సీక్వెల్ గానే  ఓదెల2 తీశారు.


నటీనటుల నటన విషయానికి వస్తే..
తమన్నా యాక్టింగ్ పరంగా అద్భుతంగా నటించిందని నాగా సాధువు పాత్రకి కరెక్ట్ గా సూట్ అయిందని తెలుపుతున్నారు.  వశిష్ట ఎన్ సింహ కూడా ప్రేతాత్మక అద్భుతంగా నటించారు. కానీ డబ్బింగ్ సెట్ కాలేదట. హెబ్బా పటేల్ కూడా కేవలం తక్కువ సమయంలోనే కనిపించింది. మిగిలిన నటీనటులు అందరూ కూడా అద్భుతంగానే నటించారు.


పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ కూడా బాగానే ఉందని ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉందని తెలుపుతున్నారు. సంపత్ నంది రైటింగ్ కొంతమేరకు వీక్ గా అనిపించిందని స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని నెటిజెన్స్ తెలుపుతున్నారు. మరి తమన్నా హిట్ కొట్టిందో లేదో కలెక్షన్స్ బట్టి చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: