బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సన్నీ డియోల్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం గదర్ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో సన్ని డియోల్ అద్భుతమైన ఫామ్ లోకి వచ్చాడు. తాజాగా సన్నీ డియోల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన జాట్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ ని ఏప్రిల్ 10 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా హిందీ భాషలో థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల ఆయన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 833.4 కే టికెట్లు సేల్ అయినట్లు తెలుస్తోంది. దీనితో ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో మంచి రెస్పాన్స్ లభించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ప్రస్తుతం మంచి కలక్షన్లు దక్కుతున్నాయి. దానితో ఈ మూవీ కి లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లు దక్కే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇకపోతే దర్శకుడు గోపీచంద్ మలినేని తన తదుపరి మూవీ ని నందమూరి బాలకృష్ణ తో చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబోలో వీర సింహా రెడ్డి మూవీ వచ్చి మంచి విజయాన్ని సాధించింది. దానితో వీరి కాంబోలో మరో మూవీ రూపొందితే దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: