చాలా రోజుల నుండి సినీ నటుడు రాజ్ తరుణ్ ఆయన ప్రియురాలు లావణ్య మధ్య హైడ్రామా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకోవడంతో పాటు ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. అలాగే రాజ్ తరుణ్ తనతో 11 సంవత్సరాలు లివింగ్ రిలేషన్ లో ఉండి వదిలేసి వేరే హీరోయిన్ తో తిరుగుతున్నాడని,డ్రగ్స్ కేసులో ఇరికించాడని ఇలా ఎన్నో ఆరోపణలు చేసింది.ఇక రాజ్ తరుణ్ సైతం బయటికి వచ్చి లావణ్య పై ఆరోపణలు చేశారు. మధ్యలో ఎంతోమంది ఆర్టిస్టుల పేర్లు కూడా వచ్చాయి.అయితే తాజాగా లావణ్య రాజ్ ఇద్దరు కలిపి కొనుక్కున్న ఇంట్లోకి రాజ్ తరుణ్ పేరెంట్స్ రావడానికి లావణ్య అంగీకరించలేదు. దాంతో వారు అర్ధరాత్రి వరకు ఇంటి ముందే బైటాయించడంతో ఈ గొడవ తీవ్రతరమైంది.

అయితే ఆ ఇల్లు లో తన కొడుకుకి కూడా వాటా ఉంది అని,అద్దె ఇంట్లో ఇబ్బందులు పడలేక తన కొడుకు కొన్న ఇంట్లో ఉందామని వస్తే లావణ్య రానివ్వడం లేదని రాజ్ పేరెంట్స్ అన్నారు. కానీ లావణ్య మాత్రం అది రాజ్ తరుణ్ ఒక్కడిదే కాదు అని, ఆయనకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది అని, ఈ ఇల్లు కొనడానికి 70 లక్షలు ఖర్చు పెట్టాను. అలాగే నేను సంపాదించిన డబ్బులు అన్ని ఆయనకే ఇచ్చేసాను. సర్వం అర్పించాక నాతో సంబంధం లేదని వదిలిపెట్టేసాడు.ఆ ఇల్లు కొన్నప్పుడు 1.2 క్రోర్స్..ఇప్పుడు దాని విలువ 12 కోట్లు.. అందులో సగం వాటా నాదే..రాజ్ తరుణ్ పేరెంట్స్ కొంతమందిని తీసుకువచ్చి నాకు సంబంధించిన పర్సనల్ వస్తువులను జ్ఞాపకాలను చెల్లాచెదురు చేశారు.

 నన్ను బయటికి లాగేసారు. ఇల్లు రాజ్ ఒక్కడిదే అంటున్నారు. అలాగే రాజ్ తరుణ్ ని వదిలేస్తే డబ్బులు కూడా ఇస్తానంటున్నారు. రాజ్ తరుణ్ మగాడు కాకపోయినా సరే నేను ఆయన్ని ఉంచుకుంటాను.కానీ ఇలాంటి వారి మాటలని నేను పట్టించుకోను. శేఖర్ బాషా వంటి వారికి డబ్బులు ఇచ్చి రాజే ఇలా చేయిస్తున్నారు. కానీ అలాంటి గేగాళ్లతో తిరగద్దని రాజ్ కి నేను సలహా ఇస్తున్నాను అంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ గొడవలో పోలీసులు కలగా చేసుకోవడంతో లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్ ని ఇంట్లోకి రానిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: