టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంటారు. అందులో నటి సమంత ఒకరు. ఈ చిన్నది చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమా అనంతరం సమంతకు తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ చిన్నదానితో సినిమాలు చేయడానికి ఎంతో మంది దర్శక నిర్మాతలు ఎదురుచూసేవారు. సమంత దాదాపు ఇండస్ట్రీలో ఉన్న తెలుగు స్టార్ హీరోలందరి సినిమాలలో కలిసి నటించింది.


తన నటన అంద చందాలకు గాను ఎన్నో అవార్డులను సైతం పొందింది. ప్రస్తుతం ఈ చిన్న దానికి విపరీతంగా అభిమానులు, అభిమాన సంఘాలు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ సమంతకు విపరీతంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా సమంత తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. వరుసగా ఫోటో షూట్ లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి.  ఇక సమంత రీసెంట్ గానే బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

అక్కడ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సమంత రీసెంట్ గా సిటాడెల్ : హనీ బన్నీ లో నటించిన సంగతి తెలిసిందే. ఇది సిటాడెల్ ఇంగ్లీష్ వెర్షన్ ను హనీ బన్నీగా రీమేక్ చేశారు. ఇందులో వరుణ్ ధవన్, సమంత కలిసి జంటగా నటించారు. కాగా, ఈ సిరీస్ ను రద్దు చేస్తున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. ఇటాలియన్ వెర్షన్ సిటాడెల్ డయానాకు మాత్రమే సీక్వెల్ ఉందని తెలిపారు. ఒరిజినల్ సిరీస్ ఇంగ్లీష్ కు మాత్రమే కొనసాగింపుగా సీజన్-2 ను తీసుకురానున్నారు. ప్రియాంక చోప్రా నటించిన సీజన్-2 వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది. దీంతో సమంత అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: