ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో అతి చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించాడు. అందులో కొన్ని సినిమాలు సక్సెస్ కాగా మరికొన్ని సినిమాలు డిజాస్టర్ గా మారాయి. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను తీయగా అది కూడా మంచి విజయాన్ని అందుకుంది. 

పుష్ప-2 సినిమాతో అల్లు అర్జున్ మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమానూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయినప్పటికీ అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎలాంటి సినిమా షూటింగ్ లలో పాల్గొనలేదు. ఇక తమిళ డైరెక్టర్ అట్లితో కలిసి AA22 సినిమాలో నటించనున్నారట. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా.... అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తనకు, తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.


అల్లు అర్జున్ కు ఇన్ స్టాలో విపరీతంగా ఫాలోవర్స్ ఉన్నారు. తన భార్య స్నేహ రెడ్డిని తప్పితే ఎవరిని కూడా ఫాలో అవడం లేదు. ఈ క్రమంలోనే చాలామందికి అనుమానం వచ్చి అల్లు అర్జున్ గురించి సెర్చ్ చేయగా.... ఇన్ స్టాలో అల్లు అర్జున్ కు మరో అకౌంట్ ఉన్నట్లుగా తేలిపోయింది. అల్లు అర్జున్ సీక్రెట్ గా ప్రైవేట్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను మెయింటెన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. 'బన్నీ బాయ్ ప్రైవేట్' పేరుతో ఉన్న అకౌంట్ అల్లు అర్జున్ దేనని అభిమానులు గుర్తించారు. ఈ అకౌంట్ ను కేవలం హీరో హీరోయిన్లు మాత్రమే ఫాలో అవుతారట.

తన భార్య స్నేహ రెడ్డి, సమంత, త్రిష, ఉపాసన, రామ్ చరణ్, రానా, నిహారిక వంటి స్టార్లు మాత్రమే ఈ అకౌంట్ ను ఫాలో అవుతున్నట్లుగా వెళ్లడైంది. అంతేకాకుండా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ అకౌంట్ ను ఫాలో అవుతున్నారట. ఈ అకౌంట్ లో అల్లు అర్జున్ 1380 పోస్టులను షేర్ చేసుకున్నాడు. 320 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. 494 మందిని అల్లు అర్జున్ ఫాలో అవుతున్నారు. ఇందులో అల్లు అర్జున్ తన క్లోజ్ ఫ్రెండ్స్ తో మాత్రమే తనకు నచ్చిన మీమ్స్ షేర్ చేసుకుంటారని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: