లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటన, అందచందాలతో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించింది. తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం పొందింది. కాగా, ఈ చిన్నది తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా మారిన సంగతి తెలిసిందే. 

ఇక నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇప్పటివరకు నయనతార తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇక నయనతార ఒక్కో సినిమాలో నటించినందుకు కోట్లలో రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందనే విషయం తెలిసిందే. ఒక్కో సినిమాలో నటించినందుకు భారీగా డబ్బులను వసూలు చేస్తుంది. అయినప్పటికీ ఈ చిన్నదానితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు.


నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వివాహం తర్వాత కూడా నయనతార ఎప్పటిలాగే వరుసగా సినిమాలు చేసుకుంటూ తన కెరీర్ ను మంచి ఫామ్ లో కొనసాగిస్తోంది. నయనతారకు సంబంధించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారింది. నయనతార సినిమాలలో నటిస్తున్న సమయంలో ఓ తమిళ హీరోతో ప్రేమాయణం కొనసాగించిందట.

అంతే కాకుండా ఆ హీరోను వివాహం చేసుకోవాలని కూడా అనుకుందట. ఆ హీరో మరెవరో కాదు శింబు. ఈ హీరో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. వీరిద్దరూ చాలా కాలం పాటు ప్రేమలో ఉండి వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నారట. ఇక ఏమైందో తెలియదు శింబు వివాహం చేసుకోనని డైరెక్ట్ గా చెప్పేసారట. అనంతరం వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఇక నయనతార వివాహం చేసుకొని సంతోషంగా తన లైఫ్ ను కొనసాగిస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: