హీరో రాజ్ తరుణ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ హీరో తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఈ హీరో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. రాజ్ తరుణ్ కు సంబంధించి గత కొద్ది రోజుల క్రితం ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆ కేసు అనేక మలుపులు తిరిగింది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ కేసులో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.... హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కోకాపేటలోని లావణ్య ఇంటికి వెళ్లడంతో ఈ వివాదం మరోసారి చెలరేగింది.


సూరారంలో నివాసం ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజ్, రాజేశ్వరి ఇద్దరూ అద్దె ఇంట్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమ కుమారుడి ఇంట్లోకి వెళ్లి ఉందామని బుధవారం రోజున కోకాపేటకు వచ్చారు. అనంతరం ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా లావణ్య వారిని అడ్డుకుంది.కోర్టులో కేసులు ఉన్నాయని పోలీసులతో మాట్లాడిన తర్వాతనే ఇంట్లోకి రావాలంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై లావణ్య వాదించింది. అంతే కాకుండా తనపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడికి వచ్చారని, తనపై దాడి చేశారంటూ ఆరోపణలు చేసింది.


దీంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు సాయంత్రం వరకు వారి ఇంటి ముందే కూర్చున్నారు. దీనిపై నార్సింగి అడ్మిన్ ఎస్సై సుకేందర్ రెడ్డిని వివరణ కోరగా తమకు ఎవరి నుంచి ఫిర్యాదు రాలేదని చెప్పారు. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ కి బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో ఎఫైర్ ఉందని లావణ్య ఆరోపిస్తోంది. ఓవైపు తనతో ప్రేమాయణం కొనసాగిస్తూనే మరోవైపు అరియానాతో కూడా ఎఫైర్ కొనసాగించాడని లావణ్య సంచలన కామెంట్లు చేసింది.


 తనను వివాహం కూడా చేసుకున్నాడని కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చాలా సీక్రెట్ గా ఉంచి ఇప్పుడు మాకు వివాహం జరగలేదని రాజ్ తరుణ్ చెబుతున్నాడని లావణ్య అన్నారు. ఇప్పుడు అరియానాతో ఎఫైర్ కొనసాగిస్తున్నాడని ఆ కారణంగానే నాతో బ్రేకప్ చెప్పాడని లావణ్య చెబుతోంది. ఈ కామెంట్ల పైన ఇప్పటివరకు రాజ్ తరుణ్ కానీ అరియానా కానీ స్పందించలేదు. దీంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఎఫైర్ కొనసాగుతుందని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపైన ఏదో ఒక క్లారిటీ వస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: