బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి మంచి గుర్తింపు అందుకుంది. అనంతరం సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. ఈ చిన్నది బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇక దియా మీర్జా తన నటనతో మాత్రమే కాకుండా తన అందచందాలతో కూడా ఎన్నో సినిమాల్లో అవకాశాలను అందుకుంది. 

కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారింది. సొంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో సినిమాలకు నిర్మాణం వహించారు. దియా మీర్జా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా క్యాన్సర్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మానసిక సైర్యాన్ని ఇచ్చే దిశగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టేది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా దియా మీర్జా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అందులో భాగంగానే దియా మీర్జా 'కాఫిర్' సినిమాలోని రేప్ సీన్ లో నటించిన సమయంలో చాలా భయపడ్డానని, వనికిపోయానని చెప్పారు. ఆ సీన్ షూటింగ్ పూర్తి కాగానే బయటికి వెళ్లి వామిటింగ్ చేసుకున్నానని దియా మీర్జా తెలిపారు. సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు అందులో తప్పకుండా లీనం కావాలి. అప్పుడే మన వంతు పూర్తిగా న్యాయం చేయగలుగుతాం అని దియామీర్జా వెల్లడించారు.


షహనాజ్ పర్వీన్ అనే పాకిస్తానీ మహిళ జీవిత కథ ఆధారంగా కాఫిర్ సినిమాను తెరకెక్కించారు. ఆమె దారి తప్పి భారతదేశంలోకి ప్రవేశించి ఎనిమిది ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించారు. కాగా, ప్రస్తుతం దియా మీర్జా వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఆమె చేతిలో హిందీతో సహా అనేక విధాల సినిమాలు లైన్ లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: