
ఈ వెబ్ సిరీస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా పెరకెక్కించారు. అయితే ఈ వెబ్ సిరీస్ కు రాజు అండ్ డీకే డైరెక్షన్ వహించారు.. హీరోగా వరుణ్ ధావన్ నటించగా సమంత హీరోయిన్గా నటించారు. ఇందులో రొమాంటిక్ సీన్లతో పాటు యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ తో కూడా అదరగొట్టేశారు ఈ జంట. అయితే ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ ఉంటుందని అప్పట్లో కూడా ప్రకటించారు. కానీ ఊహించని విధంగా ఇప్పుడు ఈ సిరీస్ ని రద్దు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సీటాడెల్ (హనీ బన్నీ) సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రిమింగ్ అవుతోంది.
కానీ ఇప్పుడు ఇదే సమస్త ఈ సిరీస్ కి సంబంధించి సీక్వెల్ని సైతం రద్దు చేసినట్లుగా ప్రకటించారు. అయితే ఇది కేవలం ఇండియన్ వర్షన్ మాత్రమే కాకుండా ఇటాలియన్ వర్షన్ లో పాటుగా రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ విషయం పైన అటు సమంతకు ఒక బిగ్ షాక్ తగిలిందని పలువురు నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. అయితే అభిమానులకు కూడా ఈ విషయం కొంతమేరకు నిరాశని కలిగించినప్పటికీ.. మరి రాబోయే రోజుల్లో తిరిగి తెలుగు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుందేమో అన్నట్లుగా భావిస్తున్నారు.సీటాడెల్ (హనీ బన్నీ) సీక్రెట్ క్యాన్సిల్ అవ్వడం పై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.