నటుడు మరియు నిర్మాత అయినటువంటి కళ్యాణ్ రామ్ తాజాగా అర్జున్ S/O వైజయంతి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీ లో అలనాటి స్టార్ నటి అయినటువంటి విజయశాంతి , కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ ని ఈ రోజు అనగా ఏప్రిల్ 18 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లు కూడా కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించబడుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 6.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... సిడెడ్ ఏరియాలో 3 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 17.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని ఈ మూవీ కి 1.50 కోట్ల ప్రీ రిలీజ్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr