750 కోట్ల ప్రపంచ జనాభాలో ఎక్కువమందికి సోషల్ మీడియా గురించి పరిచయం అక్కరలేదు. గాలి నీరు ఎలా మనిషికి అత్యంత అవసరమో అదే రీతిలో ప్రపంచ జనాభా సోషల్ మీడియాకు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో కనెక్ట్ అవతవ్వనే ఉంది. ఫేస్ బుక్ ఇన్ స్టా గ్రామ్ ట్విటర్ లతో పాటు ఇంకా ఎన్నో సోషల్ మీడియా ఎకౌంట్స్ లేని వ్యక్తి చాల అరుదుగా కనిపిస్తున్నాడు.

ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అయితే టాప్ హీరోల అభిమానులు వారి హీరోలకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయర్స్ సంఖ్యను బట్టి తమ అభిమాన హీరో రేంజ్ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో పాటు టాప్ హీరోయిన్స్ కు కూడ సోషల్ మీడియాలో లక్షలాది సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్నారు. ఈ ట్రెండ్ పై క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెటైర్ వేసింది.

తనకు సుమారు 30 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని వాళ్ళు అంతా తనకోసం తాను నటించే సినిమాకు వస్తారు అనుకుంటే తాను నటించిన టాక్ తో సంబంధం లేకుండా వందల కోట్లల్లో కలక్షన్స్ వచ్చి తీరాలని అలాంటి పరిస్థితి తనకు ఎక్కడ ఉంది అంటూ తనపై తానే సెటైర్ వేసుకుంది. అంతేకాదు కొంతమంది హీరోలకు సోషల్ మీడియాలో కనీసం 5 లక్షల మంది ఫాలోయర్స్ కూడ ఉండరని అయితే వారి సినిమాలు ఎందుకు సూపర్ హిట్ అవుతున్నాయి కదా అంటూ కామెంట్స్ చేసింది.

అంతేకాదు సినిమా బాగుంటే అందులో నటించిన హీరో హీరోయిన్స్ కు సోషల్ మీడియలో ఫాలోయర్స్ సంఖ్య పెద్దగా లేకపోయినా కోట్ల రూపాయాలలో కలక్షన్స్ తెచ్చుకన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి అని ఆమె అంటోంది. మే 1 విడుదల కాబోతున్న రెట్రో ప్రమోషన్లలో భాగంగా పూజా హెగ్డే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఇంటర్వ్యూ చేసింది. గ్యాంగ్ స్టర్ డ్రామా గా రూపొందుతున్న ఈమూవీలో ఎక్కువ డైలాగులు లేకుండా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసేలా తన పాత్ర ఉంటుందని ఆమె చెపుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: