
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఫస్ట్ అఫ్ అదిరిపోయిందని విజయశాంతి తల్లిగా, కళ్యాణ్ రామ్ కుమారుడుగా మంచి సెంటిమెంట్ ని చూపించారని. రొటీన్ కథ అయినప్పటికీ హీరో తో ఈ సినిమా పూర్తిగా మారిపోయిందట. ఇక మ్యూజిక్ పరంగా, బిజిఎం పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని నేటిజన్స్ తెలియజేస్తున్నారు
మరొక నెటిజన్ ఇప్పుడే ఫస్టాఫ్ చూసా అయిపోయింది. సూపర్ గా ఉందని జనతా గ్యారేజ్ కాన్సెప్ట్ తో తీసుకు వచ్చినప్పటికీ కొన్నిచోట్ల సన్నివేశాలు హైలైట్ గా ఉన్నాయని పాటలు బాగా లేకపోయినా మ్యూజిక్ బాగుందని కెమెరా వర్క్ కూడా అంతంతంగా మాత్రంగానే ఉన్నది. విజయశాంతి మరొకసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా బాగా ఆకట్టుకుంది అంటూ తెలిపారు.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల యాక్షన్ సీన్స్ తో బాగానే ఆకట్టుకున్నారని ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు హైలెట్గా ఉన్నాయని కళ్యాణ్ రామ్ విజయశాంతి నటన ఈ సినిమాకి ప్లేసుగా మారిందని తెలుపుతున్నారు అయితే స్టోరీ ఊహించేలా ముందుగానే ఉన్నదంటూ పలువురు నేటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కం బ్యాక్ సినిమా అవుతుంది అంటే మరి కొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ కేవలం నామమాత్రంగానే పెట్టినట్టుగా కనిపిస్తోంది. అలాగే ఈ చిత్రంలో నటించిన మరి కొంతమంది నటీనటుల నటన కూడా అద్భుతంగానే ఉన్నట్లు నేటిజన్స్ తెలియజేస్తున్నారు. మరి మొత్తానికి పూర్తి రివ్యూ తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు రాపాడుతుందో తెలియాలి.