టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నాని ఒకరు. నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత నాని నిర్మాతగా సినిమాలను కూడా నిర్మిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన నిర్మించిన చాలా సినిమాలు అద్భుతమైన విజయాలు కూడా అందుకున్నాయి. తాజాగా కూడా నాని "కోర్టు" అనే మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. నాని తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో నాని హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఈ మూవీ ని మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను వరుసగా విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ బృందం వారు ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రస్తుతం జనాలు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా ఏరియాల థియేటర్ హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన తమిళనాడు థియేటర్ హక్కులను కూడా అమ్మివేశారు. ఈ మూవీ యొక్క తమిళనాడు థియేటర్ హక్కులను సినీ మకరన్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: