
పూజా హెగ్డే సౌత్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ మంచి ఫలితం రాలేదు. ఆమెకు వరుసగా ఫ్లాపులు రావడంతో మేకర్లు లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో నార్త్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈ అందాల భామ నార్త్ లో సినిమాలు చేస్తుంది. ఈమె కూలీ, కాంచన 4 సినిమాలలో నటిస్తోంది. అలాగే ప్రస్తుతం పూజా రెట్రో మూవీలో సూర్యకి జంటగా నటిస్తుంది. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ సినిమా వచ్చే నెల 1న విడుదల కానుంది.
ఈ సందర్భంగా తాజాగా బుట్టబొమ్మ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్లిన కూడా కచ్చితంగా స్పీకర్ నాతో ఉంటుంది. తప్పకుండా నేను ఏం పని చేస్తున్న మ్యూజిక్ వింటూ ఉంటాను. రెఢీ అవుతూ కూడా నేను సంగీతం వింటాను. రెట్రో సినిమా నాకు చాలా నచ్చింది. సూర్య రియల్ గా ఉంటారు. ఆయన కళ్లు చాలా ఎక్స్ ప్రెసివ్ గా ఉంటాయి. ఈ సినిమా ప్రేక్షకులందరికి నచ్చుతుంది' అని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.