టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన డాన్ శీను అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన అనేక సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకున్నాడు. తెలుగులో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్న ఈయన హిందీ లో మొట్ట మొదటి సారి సన్నీ డియోల్ హీరో గా జాట్ అనే మూవీ ని రూపొందించాడు.

మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 10 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదల చేశారు. ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇక ఈ మూవీ కి మంచి కలెక్షన్లు వస్తుండడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు జాట్ 2 మూవీ ని కూడా అనౌన్స్ చేశారు. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు జాట్ మూవీ కి సంబంధించిన 7 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది.

ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 70.4 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. జాట్ మూవీ ద్వారా గోపీచంద్ మలినేని కి హిందీ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: