మనకు తెలిసిందే.. కొన్ని సినిమాలను కొందరు స్టార్ హీరోస్ కావాలని రిజెక్ట్ చేస్తూ ఉంటారు . కొంతమంది స్టార్ హీరోలు ఆ సినిమా రిజెక్ట్ చేశారు మనం చేస్తే ఏం బాగుంటుంది అన్న కారణమో లేకపోతే నిజంగానే ఆ సినిమా కధా కంటెంట్ వాళ్ళకి నచ్చలేదో..? రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది స్టార్స్ కొన్ని సినిమాలను వేరే హీరో రిజెక్ట్ చేశారు అని తెలిస్తే అసలు అలాంటి సినిమాలను ఒప్పుకోరు . కానీ కొంతమంది స్టార్స్ మాత్రం అలాంటివి పెద్దగా పట్టించుకోరు . ఎవరు రిజెక్ట్ చేస్తే   మనకు ఎందుకు సినిమా కథ నచ్చిందా ..? మనం సినిమా చేస్తాం..?  నచ్చలేదా రిజెక్ట్ చేస్తాం..? అంతే ఒక హీరోతో మనకు అనవసరం . ఆ రేంజ్ లో ఉంటారు కొందరు స్టార్స్.


ఆ కేటగిరీలోకి వస్తాడు జూనియర్ ఎన్టీఆర్ . జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలన్నీ కూడా మొదటగా ఎవరో ఒక హీరో దగ్గరికి వెళ్లి అవి రిజెక్ట్ చేస్తేనే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చాయి. అయినా సరే తను నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే ఏ మాత్రం బాధపడలేదు జూనియర్ ఎన్టీఆర్ . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.



ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది.  అయితే ఈ డ్రాగన్ సినిమాను ముందుగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సల్మాన్ ఖాన్ తో చేయాలనుకున్నారట ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ఏదైనా సరే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు . అందుకే సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు ఇలాంటి ఒక జోనర్ల్ లో మూవీ లో నటించలేదు అని ఆయనకీ ఈ సినిమా బాగుంటుంది అంటూ ఆ కథ వినిపించారట . అయినా సరే సల్మాన్ ఖాన్ కి కథ నచ్చక రిజెక్ట్ చేసారట . ఆ తర్వాత ఈ కథను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించగానే ఇంప్రెస్ అయ్యి ఓకే చేశారట.  ఎప్పుడో సినిమాకు సైన్ చేసిన ఇప్పటికీ అప్డేట్స్ మాత్రం బయటికి రావడం లేదు. కానీ సినిమా హిట్ కొడితే మాత్రం  వేరే లెవెల్ లో ఉంటుంది అంటున్నారు నందమూరి అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: