ఇప్పుడు సినిమాలో హీరోయిన్లుగా నటించే వారు ఎవరు అని తెలుసుకోవడం కన్నా కూడా ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఏ హీరోయిన్ నటిస్తుంది అని తెలుసుకోవడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అఫ్కోర్స్ హీరోయిన్ల కన్నా ఐటమ్ సాంగ్ లో నటించే వాళ్లే ఎక్కువగా సినిమాని హైలైట్ చేస్తూ సినిమాకి కలెక్షన్స్ రాబడుతున్నారు . ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా "పెద్ది". ఉప్పెన లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న బుచ్చిబాబు సనా.. ఎంతో గ్యాప్ తీసుకొని మరి ఇష్టంగా చేస్తున్న సినిమా ఈ పెద్ది కావడం గమనార్హం.


ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అంతే కాదు ఈ సినిమా లో ఫస్ట్ టైం ఒక స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించబోతున్నాడు మెగా హీరో రామ్ చరణ్ . ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట . ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మెగా అభిమానులకి వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచే స్థాయిలోనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఎవరు నటించబోతున్నారు అనేది బిగ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సాధారణంగా చాలామంది యంగ్ హీరోయిన్స్ ని స్పెషల్ సాంగ్ లో మెరిసేలా చేస్తూ ఉంటారు.



అయితే బుచ్చిబాబు సన మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచించారు. ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని బ్యూటీ ని రంగంలోకి దించిన్నట్లు తెలుస్తుంది. ఆమె మరి ఎవరో కాదు "కాజల్ అగర్వాల్". అది కూడా రామ్ చరణ్ తో మంచి హిట్స్ అందుకున్న హీరోయిన్ . ఇప్పుడు స్పెషల్ సాంగ్ లో మెరవబోతున్నారట. మరొక పక్క చరణ్ - కాజల్ కాంబో గురించి తెలిసి బాగా ఈ సినిమాపై హైప్స్ పెంచేసుకుంటున్నారు జనాలు. చూడాలి మరీ ఈ కాంబో ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో...???

మరింత సమాచారం తెలుసుకోండి: