
గోశాల నిర్వహణలో లోపం ఉందా? లేక ఆవులకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు సరైన స్పష్టత రావడం లేదు. అయితే గోవుల మరణం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. భూమన, టీడీపీ మధ్య వార్ అంతకంతకూ ముదురుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
అయితే ఈ వివాదం వల్ల తెలుగుదేశం పార్టీకి ఇబ్బందేనా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోవుల మరణాన్ని రాజకీయంగా వాడుకోవడానికి వైసీపీ సిద్ధం కాగా భూమన, మరి కొందరు నేతలను హౌస్ అరెస్ట్ చేయడం సంచలనం అవుతోంది. అయితే భూమనను ఛాలెంజ్ కు పిలిచి ఆ తర్వాత అరెస్ట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం సంచలనం అవుతోంది.
రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. కూటమి నేతలకు అనుమతులు ఇచ్చి వైసీపీ నేతలకు అనుమతులు ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికార ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ వివాదం విషయంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది. వైసీపీ ఛాలెంజ్ లను పట్టించుకోకుండా ముందడుగులు వేయాల్సిన బాధ్యత కూటమి సర్కార్ పై ఉందనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రస్తుతం కొంతమంది నేతలు మాత్రమే ఉన్నారనే సంగతి తెలిసిందే . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో పుంజుకోవడం కూడా సులువైన విషయం అయితే కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.