కొన్ని కొన్ని కాంబోలు చూడడానికే కాదు వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటి ఒక కాంబోనే నయనతార - రాంచరణ్ . ఆల్రెడీ చిరంజీవి - నయనతార కాంబో సెట్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం అందరికీ తెలిసిందే.  కాగా ఇప్పుడు రామ్ చరణ్ - నయనతారల కాంబో గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . నిజానికి నయనతార - రామ్ చరణ్ కాంబోలో సినిమాని ఫిక్స్ చేశారట కానీ ఆమె రిజెక్ట్ చేసిందట. మెగా పవర్ స్టార్ చరణ్ కి అక్క పాత్రలో నయనతారను చూస్ చేసుకున్నారట ఓ డైరెక్టర్.


ఆయన మరెవరో కాదు బ్రూస్లీ సినిమా డైరెక్టర్ . రామ్ చరణ్ కెరియర్ లో కొన్ని సినిమాలు చూడొచ్చు అనే రేంజ్ లో మాత్రమే ఉంటాయి. అందులో ఒక సినిమానే ఈ బ్రూస్లీ . రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కృతికర్బంధ సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించింది.  ఈ సిస్టర్ క్యారెక్టర్ కోసం ముందుగా నయనతారని అనుకున్నారట మేకర్స్ . అయితే నయనతార మాత్రం ఈ రోల్ ని రిజెక్ట్ చేసిందట . సిస్టర్ క్యారెక్టర్ లో నేను నటించడం ఏంటి..? అది కూడా ఒక యంగ్ హీరోకి అంటూ మెగాస్టార్ కొడుకు అని తెలిసినా కూడా ఈ సినిమా రిజెక్ట్ చేసిందట.



అప్పట్లో ఈ న్యూస్ బాగా సెన్సేషన్ గా మారిపోయింది. ప్రజెంట్ నయనతార ఎటువంటి టఫ్  సిచువేషన్ ఫేస్ చేస్తుంది అనేది అందరికీ తెలిసిందే.  కోలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు . టాలీవుడ్ లో వచ్చిన అవకాశాలు మొత్తం మిస్ చేసుకుంటుంది.  దీన్నతటికి కారణం ఆమె కెరియర్ లో తీసుకున్న కొన్ని రాంగ్ డెసీషన్స్ అంటున్నారు జనాలు. ఇక రామ్ చరణ్ తో నయనతారకి అవకాశాలు వస్తాయి అన్న ఆశలు కూడా ఎవ్వరికి లేవు. సోషల్ మీడియాలో ప్రసెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ చేస్తున్నారు అభిమానులు. మొత్తానికి నయన్ పేరు ఇలా కూడా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: