కన్నడ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో శివరాజ్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో కన్నడ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో శివరాజ్ కుమార్ కేవలం కన్నడ సినిమాలలో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం శివరాజ్ కుమార్ , రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే తెలుగు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే శివరాజ్ కుమార్ తాజాగా ఉపేంద్ర , రాజ్ బి శెట్టి తో కలిసి 45 అనే సినిమాలో కలిసి నటించాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా తమిళ్ వర్షన్ టీజర్ విడుదల కార్యక్రమాన్ని చెన్నై లో నిర్వహించింది. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో భాగంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా 45 టీజర్ విడుదల కార్యక్రమంలో భాగంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ ... కమల్ హాసన్ మరియు అమితాబ్ బచ్చన్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పకచ్చాడు. ఇక కమల్ అంటే అందం అని , ఒక వేళ తాను అమ్మాయిల పుట్టి ఉంటే కమల్ హాసన్ ను పెళ్లాడే వాడిని అని శివరాజ్ కుమార్ తాజాగా చెప్పుకొచ్చాడు.

చాలా సంవత్సరాల క్రితం కమల్ హాసన్ తన తండ్రి రాజ్ కుమార్ ను కలవడానికి ఇంటికి వచ్చిన సందర్భంలో కమల్ హాసన్ ను ఆలింగనం చేసుకున్నట్లు , అది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లు , అలాగే కమల్ హాసన్ ను ఆలింగనం చేసుకున్న తర్వాత మూడు రోజుల పాటు స్నానం కూడా చేయకుండా ఉన్నట్లు శివరాజ్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. తాజాగా శివరాజ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: