ఐశ్వర్య రాజేష్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ట్రెండింగ్ కాదు డబల్ రేంజ్ లో అల్లాడించేసిన పేరు.  నిజానికి  ఐశ్వర్య రాజేష్ పై గతంలో ఎప్పుడు కూడా పాజిటివ్ కామెంట్స్ వినిపించింది  లేదు . ఏదో వచ్చిన సినిమాలు చేసుకుని తన లైఫ్ ముందు కి తీసుకెళ్తుంది అనే రేంజ్ లోనే మాట్లాడుకున్నారు . అయితే ఎప్పుడైతే "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా హిట్ అయ్యిందో..అప్పటినుంచి ఐశ్వర్య రాజేష్ పేరు మారుమ్రోగిపోతుంది. ఇండస్ట్రీకి దొరికిన మరో సౌందర్య అంటూ కూడా చాలామంది జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు.


ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ ఖాతాలో ఒక బిగ్ బంపర్ ఆఫర్ వచ్చి చేరినట్లు వార్తలు కనిపిస్తున్నాయి.  అది కూడా పాన్ ఇండియా ఫిలి లో . యస్  ఐశ్వర్య రాజేష్ ఓ బిగ్ బడా పాన్ ఇండియా ఫిలిం లో భాగం కాబోతున్నట్లు ఓ  న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ హిట్ కొడితే ఆ తర్వాత హీరోయిన్ చుట్టే తిరుగుతూ ఉంటారు డైరెక్టర్లు . ఇది సర్వ సాధారణమే.  ఇప్పుడు ఆ లిస్టులోకి ఐశ్వర్య రాజేష్ చేరింది.  ఐశ్వర్య రాజేష్ కి సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత చాలా చాలా ఆఫర్స్ వస్తున్నాయట .



కానీ తొందరలో ఆమె కెరీర్ ని డ్యామేజ్ చేసే పాత్రను మాత్రం ఒప్పుకోవడం లేదట . ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కే సినిమాలో  సెకండ్ హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ సెలెక్ట్ అయినట్లుగా న్యూస్ బయటకు వచ్చింది . సుకుమార్ - రామ్ చరణ్ కాంబో సినిమాలో ఐశ్వర్య రాజేష్ నా..? అని షాక్ అయ్యే రేంజ్ లోనే జనాలు మాట్లాడుకుంటున్నారు.  సుకుమార్ దర్శకత్వంలో హీరోయిన్గా నటించాలి అంటే అదృష్టం ఉండాలి . పెట్టి పుట్టాలి అంటుంటారు జనాలు.  మరి అలాంటి అదృష్టం ఐశ్వర్య రాజేష్ కొట్టేసింది . ఇక ఆమె లైఫ్ మొత్తం జిల్ జిల్ జిగా అంటున్నారు . చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో....???

మరింత సమాచారం తెలుసుకోండి: