టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంటారు. మరి కొంతమంది ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేక పోతారు. ఇక మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న నటి తమన్నా భాటియా ఒకరు. ఈ చిన్నది నటించిన మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యింది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. 


తమన్నా సినీ ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 20 ఏళ్లకు పైనే అవుతోంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. తమన్నా ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ అనేక సినిమాలలో నటించింది. ఈ చిన్నది సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. ఇక తమన్నా ప్రస్తుతం వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో తన అభిమానులను ఆకట్టుకుంటుంది.


ఇక తమన్నా తాజాగా మరో సినిమాలో అవకాశం కొట్టేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'నో ఎంట్రీ' సినిమాకు సీక్వెల్ తీయబోతున్నారట. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది. బోనీకపూర్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో యంగ్ హీరోలో అర్జున్ కపూర్, దిల్జిత్ దోసాంజ్, వరుణ్ ధవన్ లీడ్ రోల్స్ లో నటించనున్నారు.


ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారట. కాగా 'నో ఎంట్రీ' సినిమా 2005లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నారు. కాగా 'నో ఎంట్రీ' సినిమాలో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బిపాసా బసు నటించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నారని తెలిసి అభిమానులు సంతోషపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: