ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీక్ కెరీర్ లో వచ్చిన సాలిడ్ సినిమాల్లో దర్శకుడు పూరి జగన్నాథ్ ని డైరెక్టర్గా టాలీవుడ్ కు పరిచయం చేసిన మెంటల్ మాస్ మూవీ బద్రి కూడా ఒకటి .. పవన్ మ్యానిరిజంలు అన్నీ కూడా ఈ సినిమా నుంచి మొదలుకాక బద్రి సినిమాకు అయితే అభిమానుల్లో  ఒక స్పెషల్  సపరేట్ ప్లేస్ ఎప్పటికీ ఉంటుంది .. అయితే ఎప్పుడో ఈ సినిమా రీ రిలీజ్  కావలసి ఉంది .. కానీ అది ఎప్పటినుంచో ఆగుతూ వస్తుంది .. అయితే ఇప్పుడు మళ్లీ బద్రి రీరిలీజ్ పై  సాలిడ్ అంచునాలైతే వినిపిస్తున్నాయి ..


ఇక దీంతో పవర్ స్టార్ మరోసారి అభిమానుల్ని అలరించేందుకు రాబోతున్నాడని కూడా చెప్పవచ్చు .. అయితే ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ కు సంబంధించిన ప్రింట్ పనులు జరుగుతుండగా ఈ సినిమాని పవన్ బర్త్ డే కి అంటే సెప్టెంబర్ 2కి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది .. అలాగే దీనిపై మరింత క్లారిటీ కూడా రావాల్సి ఉంది .. ఇక పర్టికులర్గా ఈ సినిమా కోసం మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు .. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ..


పవన్ డిప్యూటీ సీఎం గా అధికారిక బాధ్యతలతో బిజీగా ఉండటంతో ఆయన సినిమాలకు దూరమవుతున్నాడు .. ఇలాంటి క్రమంలో పవన్ నటించిన సూపర్ హిట్ సినిమాల‌ను మరోసారి రీ రిలీజ్ చేసుకొని చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.  ఇప్పటికే పవన్ నటించిన ఖుషి , జల్సా లాంటి పలు సినిమా రీరిలీజ్‌ అవ్వగా సెన్సేషనల్ కలెక్షన్లు అందుకున్నాయి .. ఇక త్వరలోనే తీన్మార్ , గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కూడా రీ రిలీజ్ కు రాబోతున్నాయి .. ఇక మరి ఈ సినిమాలతో పవన్ కళ్యాణ్ మరోసారి అభిమానులను సర్ప్రైజ్ చేయబోతున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: