
కథ :
ఎవరికైనా అన్యాయం జరిగితే అస్సలు సహించలేని అర్జున్ (కళ్యాణ్ రామ్) తనకు నచ్చిన దారిలోనే ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. అయితే అర్జున్ తల్లి వైజయంతి (విజయశాంతి) మాత్రం చట్టప్రకారం నేరస్థులకు శిక్ష పడాలని భావిస్తూ ఉంటారు. భిన్నమైన దారుల్లో పయనిస్తున్న అర్జున్, వైజయంతి ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు? తల్లి కోసం కొడుకు చేసిన త్యాగాలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
కళ్యాణ్ రామ్, విజయశాంతి తమ పాత్రల్లో అదరగొట్టారు. ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కథ అద్భుతంగా లేకపోయినా కథనం కొత్తగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్స్ సైతం బాగున్నాయి. తల్లీ కొడుకుల సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. పాటలు, బీజీఎం బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. పెళ్లి ఫేమ్ పృథ్వీ, శ్రీకాంత్ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ వీకెండ్ కు ఈ సినిమా విన్నర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
బలాలు : కళ్యాణ్ రామ్ విజయశాంతి నటన, ఎమోషనల్ సీన్స్, సెకండాఫ్
బలహీనతలు : కొన్ని రొటీన్ సన్నివేశాలు
రేటింగ్ : 3.0/5.0