- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ హీరో గా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వం లో  పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ దేవర .  త్రిబుల్ ఆర్‌ అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా కావటం తో ఈ సినిమా పై భారీ అంచనాల నెలకొన్నాయి .. అంచనాల కు తగ్గట్టు కొరటాల కూడా ఈ సినిమా ను ప్రేక్షకుల కు ఊహించ ని సర్ప్రైజ్ గా అందించాడు .. ఎన్టీఆర్ సోలో గా పాన్ ఇండియా లెవెల్ లో రూ . 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి భారీ రికార్డు నెలకొల్పాడు ..


దేవ‌ర‌ ఈ సినిమా ఇండియా లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా రికార్డ్ కలెక్షన్లు కూడా అందుకుని అదరగొట్టింది .  ఇక ఈ సెన్సేషనల్ రన్ తర్వాత ఒటీవ‌ల‌ ఈ మూవీ జపాన్లో కూడా రిలీజ్ చేశారు . అయితే జపాన్ లో కూడా దేవ‌ర‌ మూవీ మన దగ్గర నడిచినట్టే సాలిడ్ ర‌న్ న్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి .. ఇప్పటి కే అక్కడ విజయవంతం గా మూడు వారాల రన్ ని కంప్లీట్ చేసుకు ని నాలుగో వారం లో అడుగు పెట్టినట్టు గా తెలుస్తుంది .. ఇక దీంతో అక్కడ దేవర కు మంచి సక్సెస్ వచ్చింద ని కూడా అంటున్నారు .. ఇంకా ఈ సినిమా కి అనిరుద్ సంగీతం అందించగ‌ ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ  ఆర్ట్స్ వారు సంయుక్తం గా నిర్మించారు .  


అలాగే త్వరలో నే ఈ సినిమా కి సిక్వల్ కూడా మేకర్స్ మొదలు పెట్టబోతున్నారు .. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్లో వార్‌ 2 సినిమాను పూర్తి చేశాడు .  అలాగే మరి కొద్ది రోజుల్లో ప్రశాంత్ నీల్‌ సినిమా షూటింగుల్లో అడుగు పెట్టబోతున్నాడు ..  అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ దేవర 2 సినిమాను మొదలుపెట్టబోతున్నట్టు కూడా రీసెంట్గా కళ్యాణ్ రామ్ తన సినిమా ప్రమోషన్లు కూడా ప్రకటించాడు .  దీన్నిబట్టి దేవర 2 మూవీ 2027 చివర్లో ప్రేక్షకులు ముందుకు రాబోతుందని కూడా అర్థమవుతుంది .



మరింత సమాచారం తెలుసుకోండి: