
ఇప్పటికే బీర్ల ధరలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం మరి కొద్ది రోజులలో లిక్కర్ ధరలను కూడా భారీగా పెంచేసే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో చీప్ లిక్కర్ కు మాత్రం ధరల పెంపు మినహాయింపు ఉంటుందనే విధంగా వినిపిస్తున్నాయి. బీర్ల ధరలు ఇప్పటికే 15% వరకు పెంచారు అయితే త్వరలోనే లిక్కర్ పైన 10 నుంచి 15% ధరలు పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందట. అయితే ఈ విషయం పైన ఇంకా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం కేవలం కొత్త మద్యం కంపెనీలను సరఫరా చేయడంలో ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి
500 రూపాయల కంటే ఎక్కువగా ఉన్న లిక్కర్ బాటిల్ పైన 10 నుంచి 15% వరకు ధరలు పెంచినట్లు అయితే సుమారుగా ఒక్కో బాటిల్ మీద 50 నుంచి 75 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మద్యం ధరలు పెంచితే ఎలాంటి రియాక్షన్ ఉంటుందో అంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా భావిస్తోందట. మరొకవైపు పెంచిన బీర్ల ధరల వల్ల ఇప్పటికే మూడు శాతం వరకు బీర్ల అమ్మకాలు తగ్గిపోయాయని రెండు శాతం వరకు లిక్కర్ అమ్మకాలు పెరిగినట్లుగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు గమనించారట. మరి ఇలాంటి సమయంలో మద్యం ధరలు పెంచితే ఏంటన్నది చూడాలి.