హీరో నాచురల్ స్టార్ నాని హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్  చిత్రంగా నటించింది చిత్రం హిట్ -3. ఈ చిత్రం గతంలో వచ్చిన హిట్, హిట్ -2 సినిమాలకి కంటిన్యూగా హిట్ -3 చేస్తూ ఉన్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తూ ఉన్నది. ఈ ప్రాజెక్టు కూడా తనకు చాలా కీలకమని చెప్పవచ్చు . ఇటీవలే హిట్ -3 ట్రైలర్ ని కూడా విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ లభించింది. అందుకే ఈ సినిమా కలెక్షన్స్ పైన కూడా భారీగానే హైప్స్ ఏర్పడుతున్నాయి.


హిట్ 3 సినిమా సక్సెస్ కావాలి అంటే ఎన్ని కోట్లు రాబట్టాలో అనే విషయం పైన అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పటికే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో 15 కోట్ల వరకు ఆరు రీజనల్ ఏరియాలలో బిజినెస్ జరిగిందట. ఇక సీడెడ్ 5 కోట్లు నైజాంలో 11 కోట్లు వరల్డ్ వైడ్గా థియేటర్ బిజినెస్ 40 కోట్ల వరకు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.


ఈ నేపథ్యంలోనే నాని నటిస్తున్న హిట్ 3 సినిమా 40 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉన్నది. అంటే 75 కోట్ల రూపాయల మేరకు గ్రాస్ కలెక్షన్స్ రాబడితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇక ఓటిటి హక్కులను కూడా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నాని కెరియర్ లో కూడా ఈ సినిమా చాలా కీలకంగా ఉంటుందని అభిమానులు కూడా నమ్ముతూ ఉన్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి. నాని ని ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: