
ఢిల్లీ యూనివర్సిటీలో సైతం నా ఫోటోకు పూలమాలలు వేసి నన్ను నన్ను "దండమమాయి" అని పిలుస్తారని ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చారు. నేను ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయానని ఆమె పేర్కొన్నారు. ఇది నిజం అని దీనిపై వార్తా కథనాలు కూడా ఉన్నాయని ఊర్వశి రౌతేలా చెప్పుకొచ్చారు. మీరంతా వాటిని చదవొచ్చని ఆమె పేర్కొన్నారు.
నేను టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, పవన్, బాలయ్యలతో కలిసి నటించానని ఆమె వెల్లడించారు. సౌత్ లో కూడా నాకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారని ఆమె పేర్కొన్నారు. సౌత్ ఇండియాలో కూడా రెండో ఆలయాన్ని నిర్మించాలని నేను భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో సైతం ఒకింత యాక్టివ్ గానే ఉంటారనే సంగతి తెలిసిందే.
తెలుగులో పలు భారీ బడ్జెట్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేయడం ద్వారా ఆమె ప్రశంసలు అందుకుంటున్నారు. ఊర్వశి రౌతేలా రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. ఈ హీరోయిన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. ఊర్వశి రౌతేలా భారీ విజయాలను అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఊర్వశి రౌతేలా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఊర్వశి రౌతేలా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.