టాలీవుడ్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలలో నటించడమే కాకుండా.. ఒక సినిమా రిలీజ్ చేయగానే మరొక సినిమా కొన్ని నెలల వ్యవధిలోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధంగానే ఉంటుంది. సుమారుగా ప్రభాస్ రెండు మూడేళ్ల షూటింగ్ తోనే బిజీగా ఉండేలా తన సినిమాలను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే మరొక పక్క సినిమాలను కూడా కొత్త డైరెక్టర్లతో ఓకే చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ అప్పుడప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చి మరి వెకేషన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు.


ప్రస్తుతం ఫౌజి అనే టైటిల్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా కొంతమేరకు గ్యాప్  రావడంతో ఇలాంటి సమయంలోనే ప్రభాస్ విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే  సినిమా రిలీజ్ డేట్ లో పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉన్నది. గత కొంతకాలంగా సినిమా షూటింగ్లో వల్ల బిజీగా ఉన్న ప్రభాస్ ఇలా కొంత మెరకు సమయం దొరకగానే విదేశాలకు వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా విశ్రాంతి దొరికినప్పటికీ ప్రభాస్ తన మోకాలికి సర్జరీ చేయించుకున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ ఇటలీలో ఒక పల్లెటూరికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.


ప్రభాస్ ఎప్పుడు కూడా కూల్ క్లైమేట్ గురించి ఆలోచిస్తూ అక్కడికే వెళ్తారట. అలా ప్రభాస్ సుమారుగా ఒక నెలపాటు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకుని మరి వచ్చి సినిమా షూటింగ్లలో పాల్గొనేవారు. అయితే ఈసారి మాత్రం డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చే సినిమాలో నటించబోతున్నారట. అలాగే డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో రాజ సాబ్ సినిమా షూటింగ్ కూడా కొంతమేరకు మిగిలి ఉండగా ఆ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనాల్సి ఉన్నది. ఇందుకోసం కొన్ని డేట్ లను కూడా ప్రత్యేకించి మరి కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కల్కి 2 సినిమా నటించాల్సి ఉన్నది వీటికి తోడు సలార్ సీక్వెల్లో కూడా నటించాలి ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: