ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2”..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తం గా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.అయితే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను చాలా క్రియేటివ్ గా తెరకెక్కించాడు...ఈ సినిమా లో కనిపించే సెట్లు, యాక్షన్ సీన్లు, అడవుల్లో దుంగలు దాచే సీన్లు ప్ర్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..అయితే సుకుమార్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేశాడో అని ప్రేక్షకులు అనుకున్నారు.. కానీ అవన్నీ వీఎఫ్ఎక్స్ తో చేసినవే అని తేలిపోయింది.

పుష్ప-2లోని చాలా సీన్లు వీఎఫ్ ఎక్స్ లో చేసినవే. ఇన్ని రోజులు అవన్నీ నిజమైనవి అనుకున్న ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. తాజాగా వీఎఫ్ ఎక్స్ కు సంబంధించిన వీడియోను సుకుమార్ రైటింగ్స్ సంస్థ రిలీజ్ చేసింది.ఇందులో పుష్ప రాజ్ జపాన్ ఫైట్, మాల్దీవుల్లో డీలింగ్ చేయడం, అడవుల్లో చెట్ల మీద దుంగలు దాచిపెట్టడం, సముద్రంలో దుంగలు స్మగ్లింగ్ చేయడం.. ఇవన్నీ వీఎఫ్ ఎక్స్ తో క్రియేట్ చేసినట్లు చూపించారు... ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది..నెటిజన్స్ ఈ వీడియో చూసి సుకుమార్ ఎంత మోసం చేసావ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు..

అయితే సినిమా చూస్తున్న ప్రేక్షకునికి ఏ మాత్రం అనుమానం రాకుండా సీన్స్ విఎఫ్ఎక్స్ చేసిన పనితనానికి అందరూ మెచ్చుకుంటున్నారు..సినిమాకు ఇన్నేళ్లు సమయం పట్టడానికి అసలు ఇదేనని అంతా కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ తన తరువాత సినిమాను రాంచరణ్ తో చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.. త్వరలో దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: