టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. నటి మీనాక్షి చౌదరి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా నిలిచింది. అయితే ఈమె హీరోయిన్ గా కాకుండా.. సెకండ్ హీరోయిన్ గా కూడా చాలా సినిమాలు చేసింది. అందులో ఒకటి మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా. ఈ సినిమా ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికి మీనాక్షీ కోటి నుండి రెండు కోట్ల రూపాయల వరకు పారితోషికం పుచ్చుకుంది అంట.  

ఈ అందాల భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ భామ తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. మంచి మంచి సినిమాలలో నటిస్తూ తక్కువ సమయంలోనే గొప్ప గుర్తింపు సొంతం చేసుకుంది. ఈమె ఇటీవల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సందడి చేసింది. ఈ సినిమాలో దుల్కర్ కి జోడీగా మీనాక్షీ చౌదరి నటించి ప్రేక్షకుల మనసును దోచుకుంది.


ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం మూవీలో కూడా నటించి హ్యాట్రిక్ కొట్టేసింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, వెంకటేష్ కి ప్రియురాలి పాత్రలో నటించి మంచి గుర్తింపును సాధించింది. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి దుమ్ము లేపింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె ఓ పంజాబీ ఫ్యామిలీలో జన్మించింది. మీనాక్షి చౌదరి నటి మాత్రమే కాదు. ఈమె రాష్ట్ర స్థాయి స్విమ్మర్, బ్యాడ్మింటన్ ప్లేయర్, అలాగే డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఫేమినా మిస్ ఇండియా విజేతగా కూడా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: