అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రిటీలు చేసే కామెంట్లు ట్రోలింగ్ కి గురవుతూ ఉంటాయి. కొన్ని వివాదాస్పదం అవుతాయి.అయితే స్టార్ హీరో కమల్ హాసన్ మాట్లాడిన మాటలు కూడా కొంతమందికి రుచించడం లేదు.ఆ ఇద్దరి హీరోయిన్ లు నన్ను ప్రేమించలేదు అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నాయి. మరి ఇంతకీ కమల్ హాసన్ మాట్లాడిన మాటలు ఏంటి..ఆయన ఏ హీరోయిన్ల గురించి మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్..మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ హీరోగా త్రిష,అభిరామి ఇద్దరు హీరోయిన్లుగా శింబు కీలక పాత్రలో నటించిన థగ్ లైఫ్ మూవీకి సంబంధించి ఫస్ట్ పాట విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్లో కమల్ హాసన్ అందరూ ఆశ్చర్యపోయే కామెంట్లు చేశారు.

కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అభిరామి, త్రిష ఇద్దరు హీరోయిన్ లుగా చేశారు. కానీ ఏ హీరోయిన్ కూడా నాకు ఐ లవ్ యూ చెప్పలేదు అంటూ కమల్ హాసన్ నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్ గురించి మాట్లాడుతూ.. 37 ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో నేను నాయకన్ అనే సినిమా చేశాను. అయితే అప్పటికి ఇప్పటికీ మణిరత్నంలో ఎలాంటి మార్పు రాలేదు.. మేమిద్దరం కథ చర్చించుకునే సమయంలోనే 25% షూటింగ్ అయిపోయినట్టుగా భావిస్తాము. అలాగే మణిరత్నం సినిమా షూటింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలోనే షూటింగ్ ని స్టార్ట్ చేస్తారు.

మణిరత్నం ఇప్పటికీ అలాగే ఉన్నారు అంటే ఆయన గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ కమల్ హాసన్ చెప్పుకోచ్చారు.అయితే మణిరత్నం హీరోయిన్ల గురించి మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్,నటుడు శింబుల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కానీ థగ్ లైఫ్ మూవీలో నటించిన త్రిష అభిరామిల గురించి కమల్ హాసన్ మాట్లాడిన మాటలు మాత్రమే ట్రోలింగ్ కి గురయ్యాయి. ఇప్పటివరకు పెట్టుకున్న ఎఫైర్లు చాలావని ఇంకా ఈ హీరోయిన్లు కూడా నిన్ను ప్రేమించాలా అంటూ కొంతమంది నెటిజన్స్ కమల్ హాసన్ చేసిన కామెంట్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇక థగ్ లైఫ్ మూవీ జూన్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: