రకుల్ ప్రీత్ సింగ్ చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతోమంది హీరోలతో నటించింది.యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా ఆడిపాడింది. అయితే అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ ఓ సీనియర్ హీరోని టార్చర్ చేసిందటమరి ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ కారణంగా టార్చర్ అనుభవించిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం. రకుల్ ప్రీత్ సింగ్ వల్ల టార్చర్ అనుభవించిన హీరో ఎవరో కాదు మన్మధుడు నాగార్జున.. అవును మీరు వినేది నిజమే.. మన్మధుడు -2 మూవీలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన సంగతి మనకి తెలిసిందే.ఇక ఈ సినిమాలోని బోల్డ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున ఇద్దరు ట్రోలింగ్ కి గురైన సంగతి కూడా మనకు తెలిసిందే.ఒక రకంగా చెప్పాలంటే రకుల్ ప్రీత్ సింగ్ ని తెలుగులో ఉన్న యంగ్ హీరోస్ పట్టించుకోకపోవడానికి కారణం కూడా నాగార్జునతో చేసిన మన్మధుడు -2 సినిమానే అని అప్పట్లో చాలా మంది మాట్లాడుకున్నారు.

ఎప్పుడైతే నాగార్జునతో హద్దులు మీరి నటించిందో అప్పటినుండి యంగ్ హీరోలు తమ సినిమాలో రకుల్ ని తీసుకోవడం మానేశారని టాక్.. ఈ విషయం పక్కన పెడితే..నాగార్జున తో సినిమా చేసే సమయంలో డైట్ విషయంలో నాగార్జునను తెగ టార్చర్ చేసిందట రకుల్ ప్రీత్ సింగ్. ఈ విషయాన్ని కమెడియన్ వెన్నెల కిషోర్ బయట పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. మన్మధుడు టు సినిమా షూటింగ్ జరిగే సమయంలో నేను, రకుల్ ప్రీత్ సింగ్, నాగార్జున గారు,రాహుల్ రవీంద్రన్ నలుగురం కలిసి బయటికి డిన్నర్ కి వెళ్లే వాళ్ళం.అలా డిన్నర్ కి వెళ్లే సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేది.

ముఖ్యంగా ఈ ఫుడ్ ఇంతే తినాలి అంతే తినాలి అంతకుమించి తీసుకోకూడదు.అలా నాగార్జున కి కూడా కండిషన్లు పెట్టేసరికి ఆ టార్చర్ భరించలేక నాగార్జున మరుసటి రోజు నుండి రకుల్ ప్రీత్ సింగ్ ని డిన్నర్ కి పిలవడం మానేశారు. ఆ తర్వాత రాహుల్ రవీంద్రన్ నాన్ వెజ్ తినడం లేదని ఆయన కూడా పక్కన పెట్టేశారు. అలా చివరికి నాగార్జున నేను ఇద్దరం రోజు డిన్నర్ కి వెళ్లే వాళ్ళం అంటూ కమెడియన్ వెన్నెల కిషోర్ మన్మధుడు టు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని చెప్పుకొచ్చారు.అయితే అప్పటి విషయం మళ్ళీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: