కోలీవుడ్, టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో సూర్య ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతోనే ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ఎన్నోసార్లు సూర్య ప్లాపులను కూడా ఎదుర్కొన్నారు. అయినా కూడా సరికొత్త కథాంశంతోనే రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వస్తున్న రెట్రో సినిమా గత కొద్దిరోజులుగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. గత కొన్నేళ్లుగా హీరో సూర్యకు సరైన సక్సెస్ లేకపోవడంతో రెట్రో చిత్రం పైన  ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.


తాజాగా ఇలాంటి సందర్భంలోనే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేశారు.. ట్రైలర్ విషయానికి వస్తే.. వెల్కమ్ వెల్కమ్ 10 నిమిషాలలో జింక బిర్యాని రెడీ అనే చెప్పే డైలాగ్ తో మొదలవుతుంది.. ఆ తర్వాతే హీరో సూర్య ఎంట్రీ కనిపిస్తుంది. అయితే ఇందులో సూర్య విభిన్నమైన లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. హీరో సూర్య కూడా షో చేద్దామా అంటూ వెళ్లి హీరోయిన్ పూజా హెగ్డే ముందు బైక్ తో స్టంట్ చేస్తారు.


ఇక ఇందులో విలన్ గా కనిపిస్తున్న నటుడు చాలా అద్భుతంగా నటించడమే కాకుండా ప్రకాష్ రాజు కూడా ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. పూజా హెగ్డే డి గ్లామరస్ గా చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నది. అలాగే కన్నడలో నటుడు కూడా ఇందులో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. పూజా హెగ్డే , సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ట్రైలర్ లో చాలా ఆసక్తికరంగా ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా కనిపిస్తూ ఉన్నాయి. సూర్య కొన్ని సన్నివేశాలలో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉండడం గమనార్హం.. మొత్తానికి సూర్య ట్రైలర్ తో పర్వాలేదు అనిపించకున్నా.. మరి సినిమాతో ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: