బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లుగా చలామణి అవుతున్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందచందాలతో సక్సెస్ అందుకుంటారు. అలాంటి వారిలో నటి ఊర్వశి రౌతేలా ఒకరు. ఈ చిన్నది బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగిస్తుంది. ఈ చిన్న దానికి బాలీవుడ్ లో అనేకమంది అభిమానులు ఉన్నారు. హిందీలో అనేక సినిమాలు చేసిన ఈ చిన్నది తెలుగులోనూ నటిస్తోంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది. 


ఈ చిన్నదానిని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. స్పెషల్ సాంగ్స్ లో ఊర్వశి నటించిందంటే చాలు సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఊర్వశి వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం నటి ఊర్వశీ రౌతేలా సోషల్ మీడియా వేదికగా కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఊర్వశి మాట్లాడుతూ తనకు దక్షిణాదిన గుడి కట్టాలని కోరుతున్నారు. బద్రీనాథ్ దగ్గరలో తన ఆలయం ఉందని అక్కడ ప్రతి ఒక్కరు తన ఆశీర్వాదం తీసుకుంటారంటూ ఊర్వశి సంచలన కామెంట్లు చేశారు.


ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు తన ఫోటోలకు మాలలు వేసి భక్తితో కొలుస్తారని, ఎంతగానో తనని ఆరాధిస్తారంటూ ఊర్వశి అన్నారు. పనిలో పనిగా దక్షిణాదిలో కూడా తన ఆలయం ఒకటి కడితే చాలా బాగుంటుందని ఊర్వశీ రౌతేలా కోరుతున్నారు. ఊర్వశి షేర్ చేసుకున్న ఈ విషయాలను చూసి పలువురు నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అందులో కొంతమంది ఊర్వశి అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తే.... మరి కొంత మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయాలు అన్ని విన్న తర్వాత ఊర్వశిని వెంటనే డాక్టర్లకు చూపించాలని ఫైర్ అవుతున్నారు. నీ గుడి కట్టడం ఏంటి నువ్వేమైనా దేవతవా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం పైన ఊర్వశీ రౌతేలా ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: