సమంత ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమాలో తన అమాయకమైన నటన, అందచందాలకు కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. ఈ సినిమా అనంతరం సమంత ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది. ఇప్పటివరకు సమంత తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి ఎన్నో విజయాలనూ తన ఖాతాలో వేసుకుంది. 


సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సమంత పాడ్ కాస్ట్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. అందులో మహిళల పీరియడ్స్ గురించి మాట్లాడారు. ఇప్పటికీ పీరియడ్స్ విషయం గురించి బహిరంగంగా మాట్లాడాలంటే మహిళలు సిగ్గు పడుతున్నారని ఆమె తన నిరాశను వ్యక్తం చేసింది.


ప్రస్తుతం సమంత షేర్ చేసుకున్న ఈ విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. మహిళలుగా మేము ఇంత దూరం వచ్చాము. అయినప్పటికీ ఈ విషయం గురించి మాట్లాడడానికి సిగ్గుపడతాము. మౌనంగా ఉండిపోతాము. పీరియడ్స్ విషయం చెప్పడానికి అసలు ఇష్టపడము. అవమానంగా భావిస్తాము. ఈ మనస్తత్వాన్ని అమ్మాయిలుగా మేము మార్చుకోవాలి. ఈ ఋతుచక్రం అనేది చాలా శక్తివంతమైనది.

ఇది జీవితాన్ని ధ్రువీకరిస్తుంది. ఇది సిగ్గుపడాల్సిన లేదా తేలికగా తీసుకోవాల్సిన విషయం అసలే కాదు. మన మనసులను శరీరాలను ఋతుచక్రం ఎలా ప్రభావితం చేస్తుందో మనం ప్రతి సంవత్సరం నేర్చుకోవడం కొనసాగించాలి అంటూ సమంత మాట్లాడారు. ప్రస్తుతం సమంత షేర్ చేసుకున్న ఈ విషయాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సమంత చేసిన ఈ కామెంట్లపై చాలామంది మహిళలు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: